News March 8, 2025
CBI ఎంట్రీ.. స్మగ్లర్ నటికి మరిన్ని చిక్కులు!

విదేశాల నుంచి విమానాశ్రయాల ద్వారా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లపై CBI FIR నమోదు చేసింది. కన్నడ నటి రన్యా రావ్ అరెస్టు నేపథ్యంలో మొత్తం నెట్వర్క్ను ఛేదించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై ఎయిర్పోర్టులకు వెళ్లిన CBI బృందాలు DRI సహకారంతో దర్యాప్తు ఆరంభించాయి. గ్లోబల్ గోల్డ్ స్మగ్లింగులో రన్యాను భాగస్వామిగా అనుమానిస్తున్న సంస్థలు ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Similar News
News November 24, 2025
మెనోపాజ్లో ఎముకలు జాగ్రత్త

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ని తీసుకోవాలంటున్నారు.
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.


