News May 23, 2024
BRS ఎమ్మెల్సీ అభ్యర్థికి సీబీఐ మాజీ జేడీ మద్దతు

TG: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల MLC ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. విద్యావంతుడు, సమాజ సేవకుడు అయిన రాకేశ్ను గెలిపించాలని ఎక్స్(ట్విటర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి నీతి, నిజాయతీ ఉన్న వ్యక్తులు రావాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. పట్టభద్రులు రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Similar News
News November 28, 2025
విషపు ఎరలతో కీరదోసలో పండు ఈగ నివారణ

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చే పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తింటాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోతాయి. వీటి కట్టడికి 10 లీటర్ల నీటిలో మలాథియాన్ 100ml, బెల్లం 100 గ్రాములను కలిపి మట్టి గిన్నెలో పోసి ఎకరాకు 10-12 చోట్ల ఉంచాలి. దీనిలో పులిసిన కల్లు మడ్డి కలిపితే తల్లి పండు ఈగలు మరింత ఆకర్షింపబడి ఈ విషపదార్థాన్ని తిని చనిపోతాయి.
News November 28, 2025
APPLY NOW: ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్లో ఉద్యోగాలు

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్లో 8 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, ఇంటర్, BA(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, B.Ed, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 28, 2025
మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.


