News June 22, 2024
సాక్షిగా దస్తగిరి.. అభ్యంతరం లేదన్న సీబీఐ

AP: వివేకా హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులకు రిమాండ్ను జులై 5 వరకు నాంపల్లి CBI కోర్టు పొడిగించింది. బెయిల్పై బయట ఉన్న శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. అయితే తనను సాక్షిగా పరిగణించాలన్న దస్తగిరి పిటిషన్పై నిందితుల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే CBI మాత్రం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.
Similar News
News December 1, 2025
తెలంగాణ అప్డేట్స్

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.
News December 1, 2025
హైదరాబాద్లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?


