News September 1, 2025
భారీ కుంభకోణాల దర్యాప్తుల్లో CBI

కాళేశ్వరంపై <<17577217>>CBI<<>> విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కింద పనిచేసే CBI విచారణ చేపట్టనుంది. ఈ సంస్థ 1990 హవాలా, 2009లో సత్యం కంప్యూటర్స్, 2G స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణాల కేసులపై దర్యాప్తు చేసింది. CBI డైరెక్టర్‌ను ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉండే కమిటీ ఎంపిక చేస్తుంది.
Similar News
News September 1, 2025
సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు?

దేవుళ్లు, దేవతలకు వాహనాలతోపాటు ఆయుధాలు కూడా ఉంటాయి. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంతో ప్రత్యేకం. ఈ ఆయుధ ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దీంతో రాక్షసులను ఓడించే దివ్య ఆయుధం కోసం ఆయన శివుడిని ప్రార్థించారు. దీంతో ముక్కంటి సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణువుకు అందించారని శాస్త్రాలు చెబుతున్నాయి.
News September 1, 2025
చెప్పులో దూరిన పాము.. చూడకుండా ధరించడంతో!

వర్షాల వల్ల సర్పాలు, కీటకాలు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, హెల్మెట్స్‌లో తలదాచుకుంటుంటాయి. అలా బెంగళూరులో మంజు ప్రకాశ్ అనే యువకుడు ఇంటి బయట ఉంచిన చెప్పులను పరిశీలించకుండా ధరించాడు. దీంతో అందులో ఉన్న పాము కాటేసింది. గతంలో ఓ ప్రమాదం వల్ల ప్రకాశ్ తన కాలులో స్పర్శ కోల్పోవడంతో కాటేసినట్లు తెలియలేదు. అరగంట పాటు ఆ చెప్పులతోనే నడిచి ఇంటికెళ్లిన కొద్దిసేపటికే చనిపోయాడు. పాము కూడా మరణించింది.
News September 1, 2025
యమ ధర్మరాజు ప్రకారం పాపాలు ఏంటి?

పుణ్యాలు చేసిన వాళ్లు స్వర్గానికి, పాపాలు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. యమధర్మరాజు ప్రకారం.. తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తులను తిట్టి హింసించేవారు, పరస్త్రీలను కామించేవారు, గోహత్య, శిశుహత్య చేసినవారు మహాపాపులవుతారు. ఇతరుల ఆస్తులను దోచుకొనేవారు, శరణుజొచ్చినవారిని కూడా బాధించేవారు, వివాహాది శుభకార్యాలకు అడ్డుతగిలేవారు కూడా పాపాత్ములే.