News March 22, 2024
డ్రగ్స్ కేసు కూపీ లాగుతున్న సీబీఐ
AP: విశాఖలో పట్టుబడ్డ 25 వేల కేజీల డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు కాకినాడ జిల్లాకు చేరింది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పరిశ్రమలో ఇవాళ సీబీఐ అధికారులు దాడులు చేశారు. అక్కడి సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్‌ని విశాఖకు తరలించినట్లు సమాచారం. కాగా విశాఖకు చేరుకున్న డ్రగ్స్ కంటెయినర్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరుతో బుక్ అయింది.
Similar News
News January 3, 2025
అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
News January 3, 2025
6న విచారణకు రావాలని కేటీఆర్‌కు ACB నోటీసులు
TG: ఫార్ములా-ఈ రేస్ కార్ స్కాం కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అటు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌కు కూడా నోటీసులిచ్చింది. కాగా ఇప్పటికే ఈ స్కాంపై విచారణ చేపట్టిన ఈడీ.. ఈనెల 7న విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన 6న ఏసీబీ, 7న ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.
News January 3, 2025
Gold vs Sensex: ఫస్ట్ 100,000 మైలురాయిని తాకేదేంటి?
కొత్త ఏడాది కావడంతో బంగారం, సెన్సెక్స్‌లో లక్ష మైలురాయిని ఏది ముందుగా తాకుతుందన్న చర్చ జరుగుతోంది. జియో పొలిటికల్ టెన్షన్స్, అనిశ్చితి, ట్రంప్ అధికారం చేపడుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది అనలిస్టులు గోల్డుకే ఓటేస్తున్నారు. కొందరు 2025, మరికొందరు 2026లో టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెన్సెక్స్ 96,000 స్థాయిని చేరొచ్చని చెప్తున్నారు. చివరి ఆరేళ్లలో GOLD 16.6%, SENSEX 14% AVG రాబడి ఇచ్చాయి.