News December 23, 2024
ఇంటర్‌పోల్ కోసం భారత్‌పోల్.. సిద్ధం చేసిన CBI

ఇంటర్‌పోల్ నుంచి అవసరమైన సమాచారాన్ని పొందేలా అన్ని రాష్ట్రాలు, దర్యాప్తు సంస్థల కోసం సరికొత్త టెక్నాలజీ వ్యవస్థ ‘భారత్‌పోల్’ను CBI సిద్ధం చేసింది. ఇప్పటిదాకా ఇంటర్‌పోల్ సమాచారం కోసం ఏజెన్సీలు అన్నీ CBIకు అభ్యర్థనలు పంపేవి. దీని వల్ల కేసుల విచారణకు అధిక సమయం పడుతుండడంతో ఈ సమీకృత వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని Jan 7న అమిత్ షా ప్రారంభించే అవకాశం ఉంది.
Similar News
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
News December 6, 2025
ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


