News June 23, 2024

నీట్ లీకేజీపై సీబీఐ విచారణ: కేంద్రం

image

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతుండటంతో కేంద్రం ప్రభుత్వం దిగివచ్చింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని పేర్కొంది. కాగా మే 5న నీట్ పరీక్ష జరగ్గా మే 4నే ప్రశ్నాపత్రం లీకైంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

Similar News

News January 3, 2025

దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌‌చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 3, 2025

వచ్చేవారం భారత్‌కు జేక్ సలివాన్

image

US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ వచ్చేవారం భారత్‌కు రానున్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(iCET) ప్రగతిని ఆయన పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. AI, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, రక్షణ ఆవిష్కరణల రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఐసెట్‌ను భారత్, అమెరికా ప్రారంభించాయి. కాగా.. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సలివాన్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

News January 3, 2025

రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్

image

TG: రాష్ట్రప్రభుత్వం రింగ్ రోడ్డు(RRR) ఉత్తర అలైన్‌మెంట్‌ను మార్చాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరఫున భారీ ఉద్యమాన్ని మొదలుపెడతామని హెచ్చరించారు. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ కూడా అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్ చేసింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వచ్చి భువనగిరిలో బాధితులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారం రాగానే పట్టించుకోవడం మానేశారు’ అని విమర్శించారు.