News April 13, 2024

‘మేఘా’పై FIR నమోదు చేసిన సీబీఐ

image

HYD సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై సీబీఐ FIR నమోదు చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ పనులకు సంబంధించి ₹174 కోట్ల బిల్లులను క్లియర్ చేయించుకోవడానికి 8 మంది NISP, NMDC అధికారులకు కంపెనీ ₹78 లక్షల లంచం ఇచ్చినట్లు తేలింది. దీంతో వారిపైనా కేసు నమోదయ్యింది. కాగా ₹966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి.. రెండో అతిపెద్ద కంపెనీగా మేఘా నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2024

BJP, కాంగ్రెస్‌పై ECI నజర్.. నడ్డా, ఖర్గేకు లేఖలు

image

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై ECI చర్యలు తీసుకుంది. వెంటనే వివరణ ఇవ్వాలని BJP చీఫ్ జేపీ నడ్డా, INC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాసింది. NOV 18వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా స్పందించాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లోనూ ECI సీరియసైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీలు దూకుడుగా విమర్శలు చేసుకుంటున్నాయి.

News November 16, 2024

ఎన్నిక‌ల స్లోగ‌న్‌.. అదే పార్టీల‌కు గ‌న్‌(1/2)

image

ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి, ప్ర‌త్య‌ర్థుల‌ను కార్నర్ చేయడానికి పార్టీలు అనుస‌రించే వ్యూహాల్లో ‘నినాదం’ కీల‌కం. MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో BJP, కాంగ్రెస్ సంధించుకున్న నినాదాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అవి: ఏక్ హైతో సేఫ్ హై(ఒక్క‌టిగా ఉంటే సుర‌క్షితంగా ఉంటాం-మోదీ) *బ‌టేంగే తో క‌టేంగే(విడిపోతే న‌ష్ట‌పోతాం- UP CM) *భ‌య‌ప‌డొద్దు- రాహుల్ గాంధీ *భ‌య‌ప‌డితే చ‌స్తారు- INC *రోటీ-బేటీ-ఔర్ మ‌ట్టి (ఝార్ఖండ్ BJP)

News November 16, 2024

Politics: నినాదం వెనుక రాజ‌కీయం(2/2)

image

కాంగ్రెస్ ఉద్ధృతంగా డిమాండ్ చేస్తున్న కుల‌గ‌ణ‌నకు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి PM మోదీ ఏక్ హైతో సేఫ్ హై పిలుపునిచ్చారు. మ‌త‌ప‌ర‌మైన కోణంలో UP CM యోగి బ‌టేంగే తో క‌టేంగే నినాదమిచ్చారు. BJP విద్వేషపూరిత రాజ‌కీయాల‌ను ఎదుర్కొవ‌డానికి భ‌య‌ప‌డొద్దు, భ‌య‌ప‌డితే చ‌స్తారు అంటూ కాంగ్రెస్ నిన‌దించింది. ఝార్ఖండ్‌లో చొర‌బాటుదారుల్ని ఎన్నికల అంశంగా మార్చి రోటీ-బేటీ-ఔర్ మ‌ట్టి అంటూ గిరిజ‌నుల‌పై BJP స్లోగ‌న్ వ‌దిలింది.