News August 23, 2025

అనిల్ అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు

image

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలోని నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణం ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఆర్.కామ్, అంబానీతో సంబంధం ఉన్న చోట్ల సోదాలు చేస్తోంది. ఇటీవల ఈడీ కూడా ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆ తర్వాత విచారించిన సంగతి తెలిసిందే.

Similar News

News August 23, 2025

పెళ్లంటే మరింత అప్పుల్లోకి జారుకోవడమే: టెకీ

image

నలుగురి మెప్పు కోసం అప్పులు చేసి పెళ్లి చేసుకోవద్దని ఓ టెకీ ఆవేదనతో SMలో చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైకి చెందిన తను, తన బ్రదర్ 4ఏళ్లు కష్టపడి కుటుంబ అప్పుల్ని తీర్చేశారు. రిలాక్స్ అయ్యేలోపే అతడి పేరెంట్స్ పెళ్లికి బంగారం కొనడం, 800మంది అతిథుల్ని పిలుద్దామని చెప్పడంతో రూ.17లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఎలాంటి సేవింగ్స్ చేయలేకపోతున్నానని, ఆడంబరాలకు అప్పులు చేసి ఇబ్బంది పడొద్దని సూచించాడు.

News August 23, 2025

మునిగింది అమరావతి కాదు.. మీ పార్టీ: CBN

image

AP: ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘మునిగిపోయింది అమరావతి కాదు, మీ పార్టీ. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కలేదని బయట విషం చిమ్ముతున్నారు. చేసిన తప్పును ఇతరులపైకి నెట్టడం వైసీపీ నైజం. అరుంధతి సినిమాలో భూతం మాదిరి ఆ పార్టీ తయారైంది. దాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది’ అని సీఎం తెలిపారు.

News August 23, 2025

సల్వాజుడుం తీర్పు నాది కాదు.. సుప్రీంకోర్టుది: సుదర్శన్ రెడ్డి

image

తాను నక్సలిజాన్ని ప్రోత్సహించానన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై INDI కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి స్పందించారు. సల్వాజుడుంపై తీర్పు వ్యక్తిగతం కాదని, సుప్రీంకోర్టుదని స్పష్టం చేశారు. దీనిపై షాతో వాదనకు దిగనని, చర్చ ఏదైనా పద్ధతిగా జరగాలని హితవు పలికారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతూ అది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య అని వివరించారు.