News August 22, 2024
బెంగాల్ ప్రభుత్వంపై CBI సంచలన ఆరోపణలు

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వంపై CBI సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన ఐదురోజుల తరువాత తాము దర్యాప్తు ప్రారంభించే సమయానికి సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించింది. గురువారం సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసులో బాధితురాలి మృతదేహాన్ని దహనం చేసిన తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సాక్ష్యాలను కప్పిపుచ్చారని పేర్కొంది.
Similar News
News July 10, 2025
ఈనెల 25న మరోసారి క్యాబినెట్ భేటీ

TG: ఇవాళ్టితో కలిపి INC ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి 327అంశాలపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు ఆమోదించిన అంశాల అమలుపై ఇవాళ సమీక్షించినట్లు చెప్పారు. నెలకు 2సార్లు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన మేరకు ఈనెల 25న మరోసారి సమావేశం అవుతామన్నారు. అమిటీ, సెంటినరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు.
News July 10, 2025
ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్‌ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్(62*), కెప్టెన్ స్టోక్స్(0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4గా ఉంది.
News July 10, 2025
PHOTOS: ‘బాహుబలి’ టీమ్ రీయూనియన్

ఇండియన్ మూవీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన ‘బాహుబలి’ మూవీ విడుదలై ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా రీయూనియన్ అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ తదితరులు ఒక్కచోట చేరి తమ జర్నీని గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.