News October 13, 2025
నకిలీ మద్యంపై CBIతో విచారణ చేయించాలి: YCP

AP: CBNకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని YCP డిమాండ్ చేసింది. నేడు రాష్ట్రంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. తప్పు చేసిన వాళ్లే సిట్‌తో దర్యాప్తు చేయించడం హాస్యాస్పదమని విమర్శించింది. దోషులు ఎవరున్నా తక్షణమే అరెస్టు చేయాలని, కల్తీ సరకుతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలంది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది.
Similar News
News February 18, 2026
24న ఏపీ మంత్రివర్గ సమావేశం

AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఇందుకు సంబంధించి క్యాబినెట్ నోట్స్‌ను రూపొందించి సమర్పించాలని అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరుగుతుందన్నారు.
News February 18, 2026
AI కనెక్టివిటీకి భారత్‌కు గూగుల్ సబ్‌సీ కేబుల్స్

AI రంగంలో భారత్ అసాధారణ వృద్ధిని సాధిస్తుందని గూగుల్ CEO సుందర్ పిచాయ్ ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో పేర్కొన్నారు. భారత్-US మధ్య AI కనెక్టివిటీని పెంచేందుకు సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టును ప్రకటించారు. $15 బిలియన్ల AI హబ్ ద్వారా భారత్‌లో భారీగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. భారత విద్యార్థుల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
News February 18, 2026
తన అనారోగ్య సమస్యను వివరించిన మమ్ముట్టి

గతేడాది తాను జ్ఞానేంద్రియాల సమస్య ఎదుర్కొన్నట్లు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వెల్లడించారు. ‘విన్పించడం, వాసన గుర్తించడం లాంటివి చాలాకాలం తెలియలేదు. నడిచేందుకూ ఇబ్బంది పడ్డా. చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మనిషికి జ్ఞానేంద్రియాలు గొప్ప వరమని, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా 2025లో షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవడంతో క్యాన్సర్ అని రూమర్స్ వచ్చాయి.


