News June 16, 2024
నీట్-యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి: ఏబీవీపీ

నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఏడాది 67మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ పొందడం, వారిలో ఆరుగురు హరియాణాలో ఒకే పరీక్షాకేంద్రానికి చెందినవారే కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏబీవీపీ ప్రతినిధుల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News December 13, 2025
మరో ఘటన.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

AP: సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాంవలి కాలనీలో కుక్క స్వైర విహారం చేసింది. వీధిలోని ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికిపైగా తెగిపోయింది. బాబుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై <<18545957>>కుక్క దాడి<<>> చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.
News December 13, 2025
మెస్సీ ఈవెంట్తో సంబంధం లేదు: ఫుట్బాల్ ఫెడరేషన్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా స్టేడియంలో జరిగిన ఘటనపై ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్(AIFF) స్పందించింది. ‘అది PR ఏజెన్సీ నిర్వహించిన ప్రైవేటు ఈవెంట్. ఈ కార్యక్రమం నిర్వహణ, ప్లాన్, అమలు విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫెడరేషన్ నుంచి అనుమతి కోరలేదు’ అని స్పష్టం చేసింది. మరోవైపు మెస్సీ రావడం, ప్రేక్షకులకు చేతులు ఊపడం వరకే ప్లాన్లో ఉందని బెంగాల్ DGP రాజీవ్ కుమార్ తెలిపారు.
News December 13, 2025
గర్భాశయం ఉంటేనే మహిళ: మస్క్

హ్యూమన్ జెండర్పై ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘మీకు గర్భాశయం ఉంటే మీరు మహిళ అవుతారు. లేదంటే కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన మొదటి నుంచి హ్యూమన్ జెండర్ విషయంలో ఈ తరహాలోనే స్పందిస్తున్న విషయం తెలిసిందే. ‘మనుషుల్లో స్త్రీ, పురుషులు మాత్రమే ఉంటారు’ అని చెప్తూ ఉంటారు. LGBT వర్గాలను ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.


