News October 9, 2025

వామన్‌రావు జంట హత్యకేసులో సీబీఐ దూకుడు

image

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి జంట హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సాక్షులను ప్రశ్నించడం ప్రారంభించింది. ఇవాళ వామన్‌రావు అనుచరులు సంతోశ్, సతీశ్‌ను విచారించింది. ఆయనతో వారి ప్రయాణం, సాన్నిహిత్యంపై ఆరా తీసింది. ఈ కేసులో గత 20 రోజులుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. మొత్తం 130 మందిని అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 9, 2025

ఇతిహాసాలు క్విజ్ – 30

image

1. అశోకవనంలో సీతాదేవికి అండగా ఉండి, ధైర్యం చెప్పిన రాక్షస స్త్రీ ఎవరు?
2. శ్రీకృష్ణుడి శంఖం పేరేంటి?
3. భాగవతం రాయమని వేద వ్యాసుడిని ప్రేరేపించింది ఎవరు?
4. సూర్యుడి వాహనం ఏది?
5. ఏకోన వింశతి: అంటే ఎంత?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 9, 2025

ఈ నెల 13 నుంచి స్కూళ్లకు కొత్త టీచర్లు

image

AP: మెగా DSCలో ఎంపికైన టీచర్లు ఈ నెల 13న స్కూళ్లలో చేరనున్నారు. పోస్టింగ్‌ల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు 9, 10 తేదీల్లో అవకాశం ఇచ్చారు. ఆప్షన్ల నమోదు అనంతరం 11 లేదా 12వ తేదీన స్కూళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. 16,347 పోస్టులకు మెగా DSC నిర్వహించగా, 15,941 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలాయి. కాగా కొత్త టీచర్లకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది.

News October 9, 2025

ట్రంప్‌కు షా కౌంటర్!.. మామూలుగా లేదుగా!

image

నిన్న ZOHO మెయిల్ ఐడీ ఓపెన్ చేసిన అమిత్ షా ట్రంప్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు పోస్టులు వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ట్రంప్ భారత వస్తువులపై టారిఫ్స్ పెంచుతున్నట్లు ట్వీట్ చేస్తూ.. THANK YOU FOR YOUR ATTENTION TO THIS MATTER అని పోస్ట్ చేశారు. నిన్న అమిత్ షా స్వదేశీ ZOHO మెయిల్‌కు మారుతూ.. అచ్చం అలాగే ట్వీట్ చేశారు. భారతీయులు ZOHOకు మారితే అమెరికా టెక్ కంపెనీలకు పెద్దదెబ్బ పడటం ఖాయం.