News January 1, 2026
CBNపై KCR విమర్శలు.. TDP నేతల ఫైర్!

AP CM చంద్రబాబుపై BRS చీఫ్ KCR ఇటీవల చేసిన <<18634035>>వ్యాఖ్యలపై<<>> AP TDP నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. CBN స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందని, KCRకి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి ఆనం ఫైరయ్యారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం బాధించిందన్నారు. అధికారం పోయినప్పుడల్లా CBNపై పడి ఏడవటం BRSకు అలవాటుగా మారిందని, కేసీఆర్ TDPలోనే పెరిగారని నిన్న MLA బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
Similar News
News January 2, 2026
లొంగిపోయిన దేవా

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోలతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. దేవాపై రూ.50లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.
News January 2, 2026
ట్రాలీలు.. పబ్లిక్ టాయ్‌లెట్ల కంటే ఘోరం

సూపర్ మార్కెట్ల Cart/ట్రాలీ హ్యాండిల్స్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. E.కోలి సహా పలు ప్రమాదకర బ్యాక్టీరియాలు వాటిపై కన్పించాయట. అలాంటి వాటిపై పిల్లలను కూర్చోబెట్టడం అనారోగ్యకరమని పరిశోధకులు హెచ్చరించారు. సూపర్ మార్కెట్లకు సొంత బ్యాగ్స్ తీసుకెళ్లడం బెటర్ అని సూచించారు. ట్రాలీ పట్టుకోవడం తప్పనిసరైతే శానిటైజర్ వంటివి స్ప్రే చేసి వాడాలన్నారు.
Share It
News January 2, 2026
కనురెప్పలకూ చుండ్రు

శీతాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరిలో చుండ్రు కనురెప్పలపై కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, లాషెస్ ఊడిపోవడంతో పాటు కండ్లకలక, కార్నియా వాపు వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే రాత్రి పడుకొనే ముందు కనురెప్పలకు గోరువెచ్చటి బాదం నూనె రాసి మర్దనా చెయ్యాలి. అలాగే కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలిపి రాసినా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.


