News April 12, 2024
CBN నివాసంలో భేటీ.. అనపర్తి, ఉండి టికెట్లపై చర్చ!

ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారిన అనపర్తి, ఉండి టికెట్లపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లోకేశ్, జనసేన అధినేత పవన్, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, సిద్ధార్థ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. వీటితో పాటు అనపర్తి, ఉండి టికెట్లపైనా ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 6, 2025
రాజమండ్రి: బస్సులు, రైళ్లు కిటకిట

దసరా సెలవులు ముగియడంతో బస్సులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు 175 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో వైవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
News October 6, 2025
రాజమండ్రి: ధర లేక కోకో రైతుల దిగాలు

తూర్పు గోదావరి జిల్లాలో కోకోకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2023లో కిలో రూ. 1,030 పలికిన ధర ఈ ఏడాది రూ. 450కి పడిపోయింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించడంతో రైతుల ఆందోళనల తర్వాత కలెక్టర్ సంప్రదింపులు చేసి రూ. 50 పెంచారు. ప్రస్తుతం ఆ పెంచిన ధరతో కూడా కొనే నాథులు లేక రైతులు అల్లాడుతున్నారు.
News October 6, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ కీర్తి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈనెల 6న జిల్లాలో యథాతధంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు. పాత అర్జీల పరిష్కార స్థాయి తెలుసుకోవడానికి 1100కు ఫోన్ నంబర్‌కి చేయాలన్నారు.