News April 13, 2024
CBN, పవన్, పురందీశ్వరిి భేటీ.. అనపర్తి టికెట్ TDPకే!

అనపర్తి టికెట్ TDPకి ఇచ్చేందుకు BJP అంగీకరించినట్లు తెలిసింది. శుక్రవారం చంద్రబాబు, పవన్, పురందీశ్వరి సమావేశమైన విషయం తెలిసిందే. అనపర్తి టికెట్ ముందు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే ఇవ్వగా.. తర్వాత BJPకి దక్కింది. అసంతృప్తి వ్యక్తం కావడంతో అనపర్తికి బదులు అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె టికెట్ BJP తీసుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం చెబుతామని BJP నేతలు అన్నారట.
Similar News
News October 6, 2025
స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించ గల సమస్యలను జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, ఎంపీడీవోలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇకపై అంశాల వారిగా అర్జీలపై మండలాలు వారిగా విశ్లేషణ చేయడం జరుగుతుందని తెలిపారు. నేటి పీజీఆర్ఎస్‌లో 149 అర్జీలు స్వీకరించారు.
News October 6, 2025
రాజమండ్రి: బస్సులు, రైళ్లు కిటకిట

దసరా సెలవులు ముగియడంతో బస్సులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు 175 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో వైవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
News October 6, 2025
రాజమండ్రి: ధర లేక కోకో రైతుల దిగాలు

తూర్పు గోదావరి జిల్లాలో కోకోకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2023లో కిలో రూ. 1,030 పలికిన ధర ఈ ఏడాది రూ. 450కి పడిపోయింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించడంతో రైతుల ఆందోళనల తర్వాత కలెక్టర్ సంప్రదింపులు చేసి రూ. 50 పెంచారు. ప్రస్తుతం ఆ పెంచిన ధరతో కూడా కొనే నాథులు లేక రైతులు అల్లాడుతున్నారు.