News January 19, 2026
CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.
Similar News
News February 21, 2026
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
News February 21, 2026
667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 21, 2026
ఆప్కోతో టీటీడీ ఒప్పందం.. భారీ ఆర్డర్

AP: ఆప్కో చరిత్రలోనే తొలిసారి TTD నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3K కండువాలు, 5K దుశ్శాలువాలు, 90K కాటన్ అప్పర్‌లు, 75K కాటన్ బ్లౌజ్‌లు సరఫరా చేయాలని TTD కోరింది. వాటిపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. ఈ ఆర్డర్ నేతన్నలకు వేంకన్న దీవెన వంటిదని మంత్రి సవిత పేర్కొన్నారు. వారికి 365 రోజుల పాటు ఉపాధి అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు పనిచేస్తున్నామన్నారు.


