News November 4, 2024
కేంద్రంలోకి CBN.. లోకేశ్ను సీఎం చేసే ప్రయత్నమా?: ఎంపీ VSR

AP: జమిలి ఎన్నికలు 2027లోనే వస్తాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో TDP నిమగ్నమైందా? అని MP విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘అవినీతి సొమ్ము పంచుకోవడంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలతో 5 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్న చంద్రబాబు కొడుకు లోకేశ్ను CM చేసే ప్రయత్నంలో ఉన్నారా? చంద్రబాబు కేంద్రంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా?’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News December 13, 2025
అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నా: స్టార్క్

మరో రెండేళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నట్లు AUS స్టార్ బౌలర్ స్టార్క్ చెప్పారు. 2027లో ENG, INDలో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడాలని ఉందని ఈ 35 ఏళ్ల క్రికెటర్ తెలిపారు. అందుకోసం శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. T20Iలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చి ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు వివరించారు. తాను అనుకుంటున్నట్లు జరుగుతుందో? లేదో? అనేది తన శరీరం స్పందించడంపై ఆధారపడి ఉంటుందన్నారు.
News December 13, 2025
బస్సుల్లో పురుషులకే టికెట్లు ఇచ్చేలా చూడండి: NMUA

AP: స్త్రీశక్తి పథకంతో RTCకి డిమాండ్ పెరిగిందని NMUA వెల్లడించింది. బస్సులు ఎక్కుతున్న మహిళలు ఎంతశాతమో తెలిసింది కాబట్టి టికెట్ ఇచ్చే విధానం మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. రద్దీ వల్ల మహిళల ఆధార్ చెక్ చేసి టికెట్ ఇవ్వడంలో కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. అందువల్ల కేవలం పురుషులకే టికెట్లు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలంది.
News December 13, 2025
పెరిగిన చలి.. వరి నారుమడి రక్షణకు చర్యలు

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.


