News January 1, 2025

ప్రజలకు CBN నూతన సంవత్సర కానుకలివే.. వైసీపీ సెటైర్లు

image

AP: ఆరు గ్యారంటీలను గాలికొదిలేసిన మోసం స్టార్ CBN కొత్త సంవత్సర కానుకగా వెన్నుపోటు అస్త్రాలను ప్రజలపైకి సంధిస్తున్నారని YCP విమర్శించింది. ‘6 నెలల్లో ₹1.12L Cr అప్పు. ₹15K Cr విద్యుత్ ఛార్జీల భారం. రోడ్ ట్యాక్స్, బీచ్ ఎంట్రీ ఫీజులు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు. గిట్టుబాటు ధరకు మంగళం. ₹కోట్లలో ఆరోగ్యశ్రీ, రీయింబర్స్‌మెంట్ బకాయిలు. ఇవే ప్రజలకు బాబు సూపర్ సిక్స్ కానుకలు’ అని సెటైర్లు వేసింది.

Similar News

News January 4, 2025

సోమవారం నుంచి పెన్షన్ల తనిఖీలు

image

AP: అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనుంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి. నెలకు రూ.6వేలు తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తారు. పెన్షన్ దారులు హాజరుకాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్‌లో పెడతారు.

News January 4, 2025

150 రన్స్ కొట్టాక నితీశ్ ఇలా సెలబ్రేట్ చేస్తారా?

image

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్టులో అర్ధ సెంచరీ తర్వాత భారత ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి పుష్ప స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి 150 రన్స్ కొట్టి ‘సలార్’లో కత్తి తిప్పే సీన్‌‌ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని ఓ అభిమాని ఆయన్ను కోరారు. ‘తప్పకుండా’ అంటూ నితీశ్ రిప్లై ఇచ్చారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో నితీశ్ ఈ వాగ్దానాన్ని పూర్తిచేస్తారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

News January 4, 2025

సాగు చేసే రైతులకే రైతు భరోసా: MLC

image

TG: సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అందుకే దరఖాస్తులు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.5వేలే ఇచ్చిందని, తమ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా యాసంగి నుంచి రూ.7,500 ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే రుణమాఫీ కాని 10% రైతులకు లబ్ధి చేకూర్చేందుకూ ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.