News September 20, 2025

తిరుమలను వాడుకోవడం CBN, లోకేశ్‌కు అలవాటు: YCP

image

AP: రాజకీయాల కోసం తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం CBN, <<17773731>>లోకేశ్‌<<>>కు అలవాటుగా మారిందని YCP మండిపడింది. ‘పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, APLలో. అంటే YCP హయాంలో. పోలీసులు విచారించడంతో అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43కోట్ల ఆస్తులను TTDకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇది చట్టప్రకారం, కోర్టుల న్యాయసూత్రాల ప్రకారం జరిగింది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News September 20, 2025

H-1B వీసా ఫీజు పెంపు.. వీరికి మినహాయింపు

image

H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచిన US కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రస్తుతం H-1B వీసా కలిగి ఉన్నవారు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ 12 నెలలు లేదా అంతకుమించి ఇతర దేశాల్లో ఉంటున్నవారు రేపటిలోగా తిరిగి USకి వెళ్లాలి. గడువు దాటితే ఫీజు కట్టి వెళ్లాల్సిందే. మరోవైపు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అనుమతించిన వారికి, హెల్త్‌కేర్, మిలిటరీ, ఇంజినీరింగ్ తదితర కీలక రంగాల ఉద్యోగులకు మినహాయింపు ఉండనుంది.

News September 20, 2025

24 లేదా 25 తేదీల్లో మెగా DSC నియామక పత్రాల ప్రదానం

image

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 19న నియామక ఉత్తర్వుల అందజేతకు నిర్ణయించినా వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా అధికారిక షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

News September 20, 2025

రేపు OG ప్రీ రిలీజ్ ఈవెంట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ కాంబోలో సుజీత్ తెరకెక్కించిన OG మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని LB స్టేడియంలో రేపు 4PM నుంచి 10.30 PM వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సమయంలో రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, BJR స్టాట్యూ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.