News February 25, 2025

MLC ఎన్నికల్లో CBN, లోకేశ్‌కు ఓటు హక్కు.. పవన్ దూరం

image

AP: CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో గ్రాడ్యుయేట్ MLC ఓటు హక్కు పొందారు. ఈ నెల 27న తాడేపల్లి (M) గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ స్కూల్‌లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఉంటున్న Dy.CM పవన్ పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు, మాజీ CM జగన్ తాడేపల్లిలోనే ఉంటున్నా ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది.

Similar News

News January 26, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

image

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.

News January 26, 2026

ఫ్రెండ్ పెళ్లి కోసం 15 కేజీలు తగ్గిన మహిళ.. చివరికి!

image

తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో అందంగా కనిపించడం కోసం చైనాలో జియాయు అనే 26 ఏళ్ల యువతి కఠిన డైట్ పాటించింది. రోజూ 10KM రన్నింగ్ చేస్తూ తక్కువ మొత్తంలో వెజిటబుల్స్, చికెన్ తినేది. దీంతో 2 నెలల్లోనే 15KGల బరువు తగ్గింది. ఆమె తన డైట్ నుంచి కార్బొహైడ్రేట్స్‌ను తీసేయడం, హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ వల్ల ప్రీ డయాబెటిస్ బారిన పడింది. డాక్టర్ల వార్నింగ్‌తో ఆమె డైటింగ్‌ను ఆపేసింది.

News January 26, 2026

బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

image

TG: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చైనా మాంజా మరొకరి ప్రాణం తీసింది. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల నిష్విక(5) మెడను మాంజా మహమ్మారి కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి విలవిల్లాడింది. తండ్రి వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. <<18870079>>చైనా మాంజా<<>>పై ఇండియాలో నిషేధం ఉన్నా, పోలీసుల హెచ్చరికలు ఉన్నా వాటి అమ్మకాలు ఆగకపోవడం శోచనీయం.