News July 3, 2024

రేపు ప్రధాని మోదీతో CBN భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను వివరించనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ అవుతారు. వారికి పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు.

Similar News

News March 23, 2026

భారత్ సవాళ్లకు భయపడదు: ప్రధాని మోదీ

image

భారత్ సవాళ్లకు భయపడదని, వాటిని ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని రంగాలపై యుద్ధ ప్రభావం పడింది. యుద్ధ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. శాంతి చర్చలను భారత్ ఎప్పుడూ స్వాగతిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగుతోంది’ అని TV9 సమ్మిట్‌లో పేర్కొన్నారు.

News March 23, 2026

షెడ్యూల్ ప్రకారమే IPL మ్యాచులు: అధికారి

image

ఈ నెల 28 నుంచి IPL షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని లీగ్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఫారిన్ ప్లేయర్లు పాల్గొంటారా లేదా అనేది ఫ్రాంచైజీలు చూసుకుంటాయని, ఆ నిర్ణయం వారిదేనని తెలిపారు. వర్క్‌లోడ్, గాయాల వల్ల కొందరు ఇంకా ఆయా జట్లలో చేరలేదని పేర్కొన్నారు. కాగా తమ దేశాల క్రికెట్ బోర్డుల నుంచి NOC రాలేదని స్టార్క్ సహా పలువురు ఆటగాళ్లు ఇంకా IPL <<19429037>>టీమ్‌లలో<<>> చేరని సంగతి తెలిసిందే.

News March 23, 2026

త్వరలో రష్యా పర్యటనకు మోదీ!

image

ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇండియా, రష్యా మధ్య జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో లావ్రోవ్ మాట్లాడారు. రెండు దేశాలది కాల పరీక్షకు నిలిచిన స్నేహమని కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో రెండు రోజులపాటు ఇండియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ <<18475772>>పర్యటించడం<<>> తెలిసిందే.