News October 6, 2025

స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

image

AP: BCలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని CM CBN అన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చూడాలని అధికారులకు సంక్షేమ సమీక్షలో సూచించారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News April 2, 2026

ఎంత పడుకున్నా అలసట తీరట్లేదా?

image

రాత్రిళ్లు 7-8 గంటలు నిద్రపోయినా చాలామందికి ఉదయం లేవగానే అలసటగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం గాఢ నిద్ర లేకపోవడమే అంటున్నారు నిపుణులు. దీనికి బ్లూ లైట్, కెఫీన్, స్వీట్స్, అస్తవ్యస్తంగా ఉన్న నిద్రవేళలు, స్లీప్‌ అప్నియా, రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ వంటి నిద్ర సమస్యలు, థైరాయిడ్‌ సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరును కలిసి వారి సూచనలను పాటించాలని చెబుతున్నారు.

News April 2, 2026

ఇకపై రాజధాని అమరావతి అజేయం: పవన్

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడం శుభపరిణామం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఇకపై రాజధాని అమరావతి అజేయం. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచి పెట్టేయాలి. రాష్ట్రానికి రాజధాని ఉండటమే ఇష్టం లేని వారు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలెవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి’ అని ట్వీట్ చేశారు.

News April 2, 2026

పెరిగిన ఎండలు.. అరటి రైతులకు సూచనలు

image

అరటి చెట్లకు ఎండ నుంచి రక్షణకు వాటి పాదుల్లో జనుము, జీలుగ, అలసంద, ఆనప, గోరుచిక్కుడు వంటి వాటిలో ఏవైనా విత్తనాలను వేయాలి. వీటి నుంచి వచ్చే మొక్కలతో నేల వేడెక్కడం తగ్గి అరటి చెట్లకు మేలు జరుగుతుంది. చిన్న అరటి మొక్కలకు ఇరువైపులా ఈత ఆకులను అమర్చడం వల్ల వీటిపై ఎండ ప్రభావం తగ్గుతుంది. నీటి డ్రిప్ పైపును మొక్కకు దగ్గరగా పెట్టకుండా కొంచెం ఎడంగా పెట్టడం వల్ల, వేరుకుళ్లు తెగులు ముప్పు తగ్గుతుంది.