News January 27, 2025
పోలవరం నిర్మాణాన్ని జగన్ ఆపేస్తే CBN ఊపిరిపోశారు: నిమ్మల

AP: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా 2025 జులైకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పురుషోత్తపట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణ పనులను వైఎస్ జగన్ పూర్తిగా నిలిపేస్తే చంద్రబాబు ఊపిరి పోశారని చెప్పారు. గతంలో రైతులు కన్నీళ్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వం కనికరం చూపలేదని దుయ్యబట్టారు.
Similar News
News January 3, 2026
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇక గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే BRS ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34శాతం నీళ్లు చాలని కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పారు.
News January 3, 2026
గాలి జనార్దన్ రెడ్డి వివాదం.. SP ఆత్మహత్యాయత్నం

కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల BJP MLA గాలి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ MLA నారా భరత్రెడ్డి వర్గాల మధ్య <<18737485>>వివాదం<<>> తలెత్తింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యుడిని చేస్తూ బళ్లారి ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు.
News January 3, 2026
కోతుల కోసం మిమిక్రీ ఆర్టిస్టులు.. ఢిల్లీ ప్రభుత్వ వింత ప్లాన్!

ఢిల్లీ అసెంబ్లీ పరిసరాల్లో కోతుల బెడద తగ్గించడానికి ప్రభుత్వం ఒక వింత ప్లాన్ వేసింది. వాటిని భయపెట్టడానికి కొండముచ్చుల అరుపులను మిమిక్రీ చేసే వ్యక్తులను పనిలో పెట్టబోతుంది. గతంలో అమలు చేసిన కొండముచ్చుల కటౌట్ల ప్లాన్ వర్కౌట్ కాలేదు. వాటికి కోతులు ఏమాత్రం భయపడకపోవటంతో మిమిక్రీ చేసేవాళ్లను నియమించాలని నిర్ణయించింది. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


