News April 5, 2025
11 నెలల్లో CBN చేసిన అప్పు రూ.1.47 లక్షల కోట్లు: వైసీపీ

AP: కళ్లార్పకుండా ఒక్క క్షణంలో వేయి అబద్ధాలు చెప్పే పోటీ పెడితే చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అవుతారని YCP సెటైర్లు వేసింది. అప్పులపై అబద్ధాలు చెబుతూ హామీల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించింది. ‘రాష్ట్ర మొత్తం అప్పు 2019 మార్చికి ₹3.90L Cr, 2024 మార్చికి ₹7.21L Cr. ఇప్పుడు ఒక్క పథకమూ అమలు చేయకుండానే CBN 11 నెలల్లో ₹1.47L Cr అప్పు చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది?’ అని ప్రశ్నించింది.
Similar News
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
News October 25, 2025
C-DACలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

<
News October 25, 2025
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.


