News May 13, 2024
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 87.98% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 0.65 పెరిగింది. అమ్మాయిల్లో 91.52 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది అబ్బాయిలతో పోలిస్తే 6.40% అధికం.
వెబ్‌సైట్: https://cbseresults.nic.in/
Similar News
News February 8, 2026
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. UPDATE

TG: యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకై RBIకి రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇండెంటు పెట్టింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్లతో రూ.2,500 కోట్లు, 27 ఏళ్లతో రూ.2,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా(ఎకరాకు రూ.6,000) ఇస్తామని CM ప్రకటించిన సంగతి తెలిసిందే.
News February 8, 2026
జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి.. నివారణ ఎలా?

ప్రస్తుతం జీడిమామిడి తోటల్లో ‘టీ దోమల’ ఉద్ధృతి పెరిగింది. ఇవి పంట లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. వీటిని సకాలంలో నివారించకుంటే పంట దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ తేయాకు దోమల కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణకు నిపుణుల సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News February 8, 2026
ఉత్తర తెలంగాణలో BJP vs MIM

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఆ జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మున్సిపల్, కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని భావిస్తోంది. అయితే ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో MIM అభ్యర్థులు బరిలో నిలిచారు. గతంలో నిజామాబాద్‌లో 16, కరీంనగర్‌లో 15 డివిజన్లు గెలుచుకున్న MIM.. ఈసారీ మేయర్ ఎంపికలో కీలకంగా మారనుంది.


