News August 11, 2024
CBSE విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు పరీక్షలు

AP: ప్రభుత్వ స్కూళ్లలోని CBSE టెన్త్ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు రేపటి నుంచి 17 వరకు విద్యాశాఖ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనుంది. దాదాపు 83 వేల మంది వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియంలో పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారి స్కిల్స్ ఎలా ఉన్నాయి? అనేది అంచనా వేసేందుకు ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. వీరు ఆరో తరగతిలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది.
Similar News
News March 6, 2026
బాలెన్ షా.. జెంజీల నయా బాద్‌షా!

నేపాల్ వారసత్వ రాజకీయాలపై తిరగబడ్డ Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపించారు. 36ఏళ్ల ఈ యువనేత.. స్ట్రక్చరల్ ఇంజినీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రైటర్, కవిగా నేపాలీలకు సుపరిచితుడు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యూత్‌లో క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. తన పార్టీ RSP <<19309327>>విజయం<<>> సాధిస్తే బాలెన్ నేపాల్ PM అవుతారు.
News March 6, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.770 తగ్గి రూ.1,62,110కు చేరింది. ఐదు రోజుల్లోనే రూ.10,980 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పతనమై రూ.1,48,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 6, 2026
న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

ఆదివారం T20 WC ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ ఢీకొంటాయి. WC చరిత్రలో హెడ్ టు హెడ్ చూస్తే కివీస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లు తలపడ్డ 3 మ్యాచుల్లో ఆ జట్టే గెలిచింది. ప్రస్తుత టీమ్‌లో ఫిన్ అలెన్, సీఫర్ట్ భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రచిన్, ఫిలిప్, చాప్‌మన్, మిచెల్‌తో కూడిన కివీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. వీరికి బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.


