News March 19, 2025

CC కెమెరాలకు ప్రజల సహకారం అవసరం: KMR ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల సహకారం అత్యవసరమని KMR జిల్లా SP రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహన చోదకులకు CC ఫుటేజీల ద్వారా చలాన్ విధిస్తామని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

HYD: ‘గ్రూప్-2’ సమస్యలపై పోరాటం ఆగదు!

image

TG గ్రూప్-2 నియామక సమస్యలపై పోరాటం ఆగదని నిరుద్యోగ JAC నాయకుడు ఇంద్రా నాయక్, పిటిషనర్లు బాలాజీ, సుజాత, మానస తేల్చిచెప్పారు. దీనిపై శాశ్వత పరిష్కారం కోరుతూ పిటీషనర్లు ప్రొ.కోదండరామ్‌ వద్దకు వెళ్లారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన నోటిఫికేషన్‌‌పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.

News November 24, 2025

మెదక్: ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న ఎస్పీ

image

మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను వారు నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు విన్నవించారు. ఎస్పీ ప్రతి ఫిర్యాదు దారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 24, 2025

MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.