News April 4, 2025

CCI పునరుద్ధరణపై లోక్‌సభలో మాట్లాడుతా: NZB MP

image

ADBలో సీసీఐ ఫ్యాక్టరీ రీఓపెన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను CCI సాధన కమిటీ సభ్యులు కోరారు. న్యూ ఢిల్లీ కొత్త పార్లమెంట్ భవన్‌లో ఎంపీ అర్వింద్‌ని గురువారం సభ్యులు కలిసి విన్నవించారు. వారి న్యాయమైన డిమాండ్ గురించి కచ్చితంగా పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఎంపీ హామీ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.

Similar News

News April 18, 2025

ధరణి బంగాళాఖాతంలో కలుపుతాం అంటేనే అధికారంలోకి: పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భోరజ్ మండలం పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణి తొలగించి భూ భారతి తెచ్చామని పేర్కొన్నారు.

News April 18, 2025

కొంకన్న గుట్టపై ఆదిమానవుడి ఆనవాళ్లు

image

బోథ్ మండలం దన్నూర్(బి) సమీపంలోని కొంకన్నగుట్ట అటవీ ప్రాంతంలో ఆది మానవుడు నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఆర్ఓ ప్రణయ్ తెలిపారు. తన బృందంతో కలిసి శుక్రవారం అడవిని పరిశీలించే క్రమంలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయన్నారు. లక్షల ఏళ్ల కిందట ఆదిమానవుడు ఉపయోగించిన సూక్ష్మ రాతి మొనదేలిన అత్యంత చురుకైన చాకు లాంటి రాళ్లు లభించాయన్నారు. వీటిని వేటకు ఉపయోగించినట్లు తెలుస్తోందన్నారు.

News April 18, 2025

రవితేజ మేనల్లుడి సినిమాలో నటించిన ఆదిలాబాద్ యువకుడు

image

హీరో ర‌వితేజ మేన‌ల్లుడు అవినాష్ వ‌ర్మ హీరోగా జ‌గ‌మెరిగిన స‌త్యం పేరుతో చిత్రీకరించిన MOVIE నేడు విడుదలైంది. మూవీలో అవినాష్ వర్మకు జోడీగా ఆద్య రెడ్డి, నీలిమ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ మూవీతో తిరుప‌తి పాలే డైరెక్ట‌ర్‌గా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. కాగా ఈ సినిమాలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిహల్ రాజ్ పుత్ నటించాడు. ఖైదీ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!