News October 16, 2025

CCI కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలి

image

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. 2025- 26 పత్తి కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, పోలీస్, అగ్నిమాపక శాఖ తదితర శాఖలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

Similar News

News October 16, 2025

మునగాల తహశీల్దార్ కార్యాలయం తనిఖీ.. ఉద్యోగుల సస్పెండ్

image

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మునగాల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో సగానికి సగం సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

News October 16, 2025

గుంటూరులో సినీనటులపై NSUI ఫిర్యాదు !

image

తెలుగు సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ పై NSUI గుంటూరు బృందం లాలాపేట స్టేషన్లో ఫిర్యాదు చేసింది. NSUI జిల్లా అధ్యక్షుడు కరీమ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పై వారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశామని అన్నారు.

News October 16, 2025

ట్రంప్ ‘ఆయిల్’ కామెంట్స్‌పై భారత్ స్పందన

image

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయబోమంటూ మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ <<18018198>>వ్యాఖ్యలపై<<>> భారత్ స్పందించింది. తాము ఆయిల్, గ్యాస్ ప్రధాన దిగుమతిదారని, దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను బట్టే కొనుగోలు చేస్తామని MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే తమ ఇంధన దిగుమతి విధానాలు రూపొందించామన్నారు. అటు ఇంధన సేకరణ పెంచుకోవడానికి అమెరికాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.