News February 7, 2025

రేపే CCL ప్రారంభం.. తొలి మ్యాచ్ ఎవరికంటే?

image

సినీ, క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలు కానుంది. రేపు తెలుగు వారియర్స్‌కు, కర్ణాటక బుల్డోజర్స్‌కు మధ్య బెంగళూరులో సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రైనోస్ vs బెంగాల్ టైగర్స్ మ్యాచ్ జరగనుంది. కాగా 14, 15వ తేదీల్లో హైదరాబాద్‌లో నాలుగు మ్యాచులున్నాయి. రేపు జరిగే మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News February 11, 2026

కోడి గుడ్డు ధరలు తగ్గాయ్

image

తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు తగ్గాయి. డిసెంబర్ నెలాఖరున, జనవరిలో రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ.8 పలకగా ఇప్పుడు రూ.6కు దిగివచ్చింది. హోల్ సేల్‌గా డజన్, ట్రే కొనుగోలు చేస్తే రూ.5కే విక్రయిస్తున్నారు. గుడ్ల ఉత్పత్తి పెరగడం, దాణా ధరలు తగ్గడంతో ఎగ్స్ రేట్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

News February 11, 2026

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.

News February 11, 2026

టారిఫ్‌లే అస్త్రంగా భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేశా: ట్రంప్

image

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు. ఇరుదేశాలు దాదాపు అణు యుద్ధం దిశగా సాగాయని చెప్పుకొచ్చారు. టారిఫ్‌లను అస్త్రంగా వాడి ఘర్షణల్ని నివారించినట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వం వల్ల దాదాపు కోటి మందికి చావు తప్పిందని స్వయంగా పాక్ ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణల్లో దాదాపు 10 విమానాలు కుప్పకూలినట్లు చెప్పారు. మనుషులు చనిపోవడం ఇష్టంలేకే యుద్ధాల్ని ఆపానన్నారు.