News November 5, 2025

CCRHలో 90 పోస్టులు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<>CCRH<<>> )90 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగలవారు NOV 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), ఎంఫార్మసీ, MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in

Similar News

News November 5, 2025

ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57 సమాధానాలు

image

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 5, 2025

రబీ జొన్నలో కలుపు నివారణకు సూచనలు

image

జొన్న విత్తిన 30-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 48 గంటలలోపు ఎకరాకు 800 గ్రా. అట్రజిన్‌ (50%) పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై సమంగా పిచికారీ చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణతో పాటు తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.