News June 16, 2024
CCS ప్రక్షాళన షురూ
TG: హైదరాబాద్ సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలపై బదిలీ వేటు వేశారు. ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడటం సహా పలు ఆరోపణలతో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు.
Similar News
News January 4, 2025
అప్పుడే మోదీ విశాఖలో అడుగుపెట్టాలి: షర్మిల
AP: విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటం ఆడుతూనే ఉందని, ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. 8న విశాఖ వస్తున్న PM మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమకు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్లాంట్ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించాకే మోదీ విశాఖలో అడుగుపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.
News January 4, 2025
SBI నుంచి 2 కొత్త డిపాజిట్ స్కీమ్‌లు
SBI రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్‌పతీ స్కీమ్‌లో రూ.లక్ష చొప్పున(రూ.లక్ష మల్టిపుల్స్) పోగేసుకోవచ్చని SBI తెలిపింది. ఈ ప్రీకాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ కనీస కాలవ్యవధి 12నెలలు కాగా, గరిష్ఠ వ్యవధి 120 నెలలు. అటు, 80ఏళ్ల పైబడిన వారి కోసం తీసుకొచ్చిన SBI ప్యాట్రన్స్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ కంటే 10బేస్ పాయింట్లు అదనంగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.
News January 4, 2025
ఆకలి తీర్చేందుకు ఫొటోలు, వీడియోలెందుకు?
ఆకలితో ఉన్న అనామకుల కడుపు నింపేందుకు ఎంతోమంది ఆహారాన్ని డొనేట్ చేస్తుంటారు. అయితే, ఇదంతా వీడియోలు, ఫొటోలు తీస్తుండటంతో కొందరు ఇబ్బందికి గురై ఫుడ్ తీసుకునేందుకు ముందుకురారు. అలాంటి ఇబ్బందులు లేకుండా జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాలను వీధుల్లో తగిలిస్తుంటారు. అవసరం ఉన్నవారు వాటితో కడుపు నింపుకుంటారు. ఈ చిన్నపాటి చొరవతో ఎలాంటి హడావుడి లేకుండా ఎంతో మంది ఆకలి తీరుతోంది.