News October 28, 2024

డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు CCTV ఫుటేజీనీ ఎత్తుకెళ్లారు!

image

ఓ బ్యాంకును లూటీ చేసిన దొంగ‌ల ముఠా డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు అక్క‌డి CCTV ఫుటేజ్‌ని కూడా ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. న్యామ‌తి టౌన్‌లోని SBI ACB నెహ్రూ రోడ్ బ్రాంచ్‌లో కిటికీలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్ప‌డిన ముఠా లాక‌ర్ల‌లోని డ‌బ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే పోలీసుల‌కు త‌మ ఆన‌వాళ్లు ల‌భించ‌కూడ‌ద‌ని CCTV ఫుటేజ్‌ని సైతం ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 22, 2026

10 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు

image

TG: రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడు విడతల్లో రూ.1,034.42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన రూ.2 వేల కోట్ల బకాయిలు రావాలంటే పాత నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (UCs) సమర్పించాలని కేంద్రం పేర్కొంది.

News February 22, 2026

నిమ్మకు డ్రిప్ విధానంలో నీరు అందిస్తే మేలు

image

నిమ్మలో పూత, పిందె, పండు అభివృద్ధి దశలో తప్పనిసరిగా నీరు అందించకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ తోటలకు డ్రిప్ ద్వారా నీరు అందించడం మంచిదంటున్నారు నిపుణులు. దీని వల్ల 14-25% వరకు నీరు ఆదా అవడంతో పాటు కలుపు 30% తగ్గుతుంది. నీటిలో తేమ ఎక్కువ రోజులుండి కాయ నాణ్యత, దిగుబడి పెరిగి తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. ఎరువులను కూడా డ్రిప్ విధానంలో అందించవచ్చు. దీని వల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు.

News February 22, 2026

రోజుకు 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బులకు చెక్!

image

ఆఫీసులలో గంటల తరబడి కూర్చునే వారికి మెట్లెక్కడం ఒక మంచి ఎక్సర్‌సైజ్. రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కితే గుండె జబ్బుల రిస్క్ 20% తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని వేగంగా పెంచుతుంది. మరోవైపు వేగంగా నడిస్తే మెటబాలిజం మెరుగుపడి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. మెట్లెక్కడం కీళ్లపై ఒత్తిడి పెంచుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు నడవడం బెటర్. టైమ్ తక్కువున్నప్పుడు మెట్లెక్కాలి.