News September 25, 2025
సీడీఎస్ అనిల్ కుమార్ పదవీకాలం పొడిగింపు

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ కుమార్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్ 30తో ఆయన పదవీకాలం ముగియనుండగా వచ్చే ఏడాది మే 30 వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 40 ఏళ్ల పాటు సైన్యంలో పలు హోదాల్లో పనిచేసిన చౌహాన్ 2021 మే నెలలో ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. 2022 సెప్టెంబర్‌లో ఆయనను దేశ రెండో సీడీఎస్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 25, 2025
వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.
News September 25, 2025
ఒత్తిడి చాలా ప్రమాదకరం: అక్షయ్ కుమార్

నేటి ప్రపంచంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలతో ప్రెషర్‌కు గురై జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దని ఓ షోలో చెప్పారు. సాదాసీదాగా జీవితాన్ని గడపాలని సూచించారు. తాను అందరిలాగే సెలవులు తీసుకుంటానని, ఏడాదిలో 125 రోజులు బ్రేక్‌లో ఉంటానని పేర్కొన్నారు. ఆదివారాలు, సమ్మర్ వెకేషన్, దీపావళికి 3 రోజులు సెలవులో ఉంటానని పేర్కొన్నారు. సమయపాలన పాటించడం చాలా ముఖ్యమన్నారు.
News September 25, 2025
ఆసియాకప్‌లో భారత్‌దే హవా

ఆసియాకప్‌లో 1984 నుంచి టీమ్ఇండియాదే హవా కొనసాగుతోంది. మొత్తం 17 ఎడిషన్లలో 12 సార్లు <<17820873>>ఫైనల్<<>> చేరింది. ఇప్పటివరకు 8 సార్లు విజేతగా, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇవాళ జరిగే పాక్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విజేతతో ఈ నెల 28న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. అటు ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో భారత ఓపెనర్ అభిషేక్(248), వికెట్ల జాబితాలో బౌలర్ కుల్దీప్(12w) తొలి స్థానాల్లో ఉన్నారు.