News October 11, 2025
Ceasefire: సైన్యం వెనక్కి.. ప్రజలు గాజాలోకి!

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పీస్ డీల్ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. తమ దళాలను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దీంతో రెండేళ్లుగా గుడారాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కానీ గాజాలో అంతా నాశనమైందని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఆయుధాలు వదలబోమని హమాస్ నేతలు చెబుతుండటంతో యుద్ధం ముగుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News October 11, 2025
Lunch Break: భారత్ స్కోరు 427/4

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 427/4 స్కోరు చేసింది. తొలి సెషన్‌లో 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జైస్వాల్ (175) రనౌట్ కాగా, నితీశ్ (43)ను వారికన్ ఔట్ చేశారు. కెప్టెన్ గిల్, జురెల్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. గిల్ (75) సెంచరీ దిశగా సాగుతున్నారు.
News October 11, 2025
నేషనల్, ఇంటర్నేషనల్ అప్‌డేట్స్…

* ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దేశ PMగా సెబాస్టియన్ లెకోర్నోను మళ్లీ నియమించారు. లెకోర్నో కేబినెట్ కూర్పు వివాదంతో 4 రోజుల క్రితం రాజీనామా చేశారు.
* చైనాపై ప్రస్తుత టారిఫ్‌లకు అదనంగా మరో 100% సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది అమెరికా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
* పిల్లల మరణానికి కారణమైన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌ను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది.
News October 11, 2025
మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?

కొత్తగా మేకప్ ప్రయత్నించాలనుకొనే వారికోసం ఈ చిట్కాలు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటో గుర్తించాలి. డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా..దాన్ని బట్టి కాస్మెటిక్స్ ఎంచుకోవాలి. ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ఫౌండేషన్. ఇది మీ చర్మటోన్, టెక్స్‌చర్‌కు సరిపోయేలా ఉండాలి. డార్క్‌సర్కిల్స్‌కు కన్సీలర్ వాడాలి. కళ్లకు ఐలైనర్, కనురెప్పలకు మస్కారా, పెదాలకు లిప్‌లైనర్, లిప్‌స్టిక్ వేసుకోవాలి. <<-se>>#BeautyTips<<>>