News January 31, 2025
సీజ్ఫైర్ అమలు: వారి విడుదలలో ఉద్రిక్తత

ఇజ్రాయెల్, థాయ్ దేశాలకు చెందిన బందీలను హమాస్ విడుదల చేసే సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో హమాస్ సాయుధులు, గాజా పౌరులు బందీలను చుట్టుముట్టారు. దీంతో 100 మందికి పైగా పాలస్తీనా ఖైదీల విడుదలను ఇజ్రాయెల్ వాయిదా వేసింది. చివరికి ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్, థాయ్ బందీలను హమాస్ అప్పగించింది. తదుపరి బందీల రక్షణకు మధ్యవర్తులు హామీ ఇవ్వడంతో పాలస్తీనా ఖైదీల విడుదలను ఇజ్రాయెల్ ప్రారంభించింది.
Similar News
News November 16, 2025
‘ఇలా దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి’

రావి ఆకుపై ప్రమిదను ఉంచి, అందులో నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే.. పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజిస్తే శాపాలు, దోషాలు, గత జన్మ కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలగడానికి ఈ దీపం పెట్టాలి’ అని సూచిస్తున్నారు.
News November 16, 2025
MSTC లిమిటెడ్లో 37 ఉద్యోగాలు

<
News November 16, 2025
తీవ్ర గాయం.. ఐసీయూలో శుభ్మన్ గిల్?

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ <<18294780>>మెడనొప్పితో<<>> బాధపడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడి వెళ్లారు. అయితే అది తీవ్రం కావడంతో గిల్ను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్తో స్ట్రెచర్పై తీసుకెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజురీ అయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


