News August 17, 2025
అఫిడవిట్ అడిగిన CEC.. స్పందించిన రాహుల్

CEC <<17435119>>వ్యాఖ్యలపై<<>> రాహుల్ గాంధీ స్పందించారు. ‘ఈసీ నన్ను అఫిడవిట్ అడిగింది. నా లాంటి ఆరోపణలే చేసిన అనురాగ్ ఠాకూర్ (బీజేపీ నేత)ను ఎందుకు అడగలేదు. MH అసెంబ్లీ ఎన్నికలను NDA క్లీన్‌స్వీప్ చేసింది. ఆ ఫలితాలపై రీసెర్చ్ చేశాం. 4 నెలల్లో ఈసీ కోటి ఓట్లు చేర్చినట్లు గుర్తించాం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లలో తేడా లేదు. కొత్తగా వచ్చిన కోటి ఓట్ల వల్లే ఎన్డీయే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 18, 2025
తిరుమలలో గందరగోళం జరగలేదు: TTD

తిరుమల క్యూలో గందరగోళం జరిగినట్లు వస్తున్న వార్తలను TTD ఖండించింది. వైరల్ అవుతోన్న వీడియో తోపులాటకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. భక్తులను సమూహాలుగా విభజించి తాళ్ల సాయంతో క్రమబద్ధీకరిస్తుండగా కొందరు ఉత్సాహంతో ముందుకు కదిలారని.. దాన్ని తోపులాట అని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. గత 3 రోజుల్లో 2.5 లక్షల మంది ఎలాంటి అంతరాయం లేకుండా స్వామివారిని దర్శించుకున్నారని వివరించింది.
News August 18, 2025
తోటి దర్శకులను ప్రశంసించలేరా?.. నెట్టింట విమర్శలు

రూ.1000 కోట్ల దర్శకులు వినోదం పంచితే తమిళ డైరెక్టర్లు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారన్న దర్శకుడు మురుగదాస్ <<17434441>>వ్యాఖ్యలు<<>> చర్చకు దారి తీశాయి. తోటి దర్శకుల ఘనతను ప్రశంసించలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నెటిజన్లు ఫైరవుతున్నారు. వినోదంతో పాటు అంతర్లీనంగా జీవిత పాఠాలను చెప్పే దర్శకులు ఉన్నారని అంటున్నారు. మురుగదాస్ తీసిన కొన్ని సినిమాలను ప్రస్తావిస్తూ.. వాటితో ఏం ఎడ్యుకేట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.
News August 18, 2025
ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్నారా: అంబటి

AP: సినీ హీరో ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీవ్ర <<17432318>>వ్యాఖ్యలు<<>> చేశారంటూ ఆడియో వైరలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త TDP అధిష్ఠానం దృష్టికి చేరడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘చిన్న ఎన్టీఆర్‌ను చూసి పెద బాబు, చిన బాబు భయపడుతున్నారా?’ అని చంద్రబాబు, లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. అటు MLA వివరణ ఇచ్చుకున్నా NTR అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.