News October 7, 2025

ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు: కాంగ్రెస్

image

బిహార్‌లో ఎన్ని నాన్ సిటిజెన్స్ ఓట్లను తొలగించారో వెల్లడించే ధైర్యం CECకి లేదని CONG ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘SIRలో పౌరులు కాని వ్యక్తుల పేరిట ఉన్న ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తొలగించిన ఓట్ల లెక్కల్ని దేశ ప్రజలకు తెలిసేలా బయటపెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పని మాత్రం చేయడం లేదు’ అని Xలో విమర్శించారు. కాగా బిహార్ SIRపై తమ అనాలసిస్‌ను జైరామ్ రమేశ్ Xలో పోస్టు చేశారు.

Similar News

News March 12, 2026

మనుషులూ 200 ఏళ్లు బతకొచ్చు!

image

భూమిపై ఎక్కువకాలం బతికే జీవుల్లో తిమింగలం ఒకటి. అందులోనూ Bowhead రకం 200 ఏళ్లు జీవిస్తుంది. దీని దీర్ఘాయువుకు క్యాన్సర్, ఇతర వ్యాధుల నియంత్రణకు DNA రిపేర్ ప్రొటీన్‌గా పిలిచే CIRBP కారణమని రోచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని మానవ కణాలు, కొన్ని రకాల ఈగల్లో ప్రవేశపెట్టగా DNA రిపేర్ సాధ్యమైంది. ఈగలు ఎక్కువ కాలం జీవించాయి కూడా. మానవుల్లోనూ సక్సెస్ అయితే 200Y బతకడం సాధ్యమేనంటున్నారు.

News March 12, 2026

మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

image

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 12, 2026

యుద్ధం.. అమెరికాకు 6 రోజులకే రూ.లక్ష కోట్లు

image

ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న అమెరికాకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. తొలి 6 రోజులకే $11.3Bn(₹1.04L Cr) వ్యయమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. క్లోజ్డ్ డోర్‌లో జరిగిన భేటీలో US శాసనసభ్యులకు పెంటగాన్ ప్రతినిధులు ఈ విషయాన్ని తెలిపారని పేర్కొంది. ఆపరేషన్ ప్లానింగ్, సైనికులు, ఆయుధాల తరలింపు సహా అనేక ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు మరింత పెరుగుతుందని తెలిపింది.