News April 1, 2024
సెలబ్రిటీలు నిలబెట్టారు.. మరి ఇప్పుడో? – 1/2

కొన్నిచోట్ల స్టార్‌డమ్ పార్టీలను గెలిపిస్తుంది. BJPకి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ సీటు అలా వచ్చిందే. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాను నిలబెట్టి 1998లో తొలిసారి గెలుపొందిన BJP.. 1999, 2004లోనూ ఖన్నా సాయంతో విజయపరంపర కొనసాగించింది. 2009లో ఓడినా 2014లో ఖన్నా మళ్లీ గెలిచారు. 2017లో ఆయన మృతి తర్వాత సవర్న్ సింగ్ అనే పారిశ్రామికవేత్తకు బైఎలక్షన్‌లో BJP టికెట్ ఇవ్వగా ఓటమి ఎదురైంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News March 17, 2026
మహిళా యాక్టర్లు పబ్లిక్ ప్రాపర్టీలు కాదు: ఖుష్బూ

అనవసర చర్చల్లోకి మహిళా యాక్టర్లను లాగుతున్నారని BJP నేత, నటి ఖుష్బూ సుందర్ ఫైరయ్యారు. ‘ఇతరులను విమర్శించేందుకు ఓ మహిళ ఐడెంటిటీని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి మగాడు జన్మించేది స్త్రీకే. మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడతారా? మహిళా యాక్టర్లు పబ్లిక్ ఫిగర్లు కావచ్చేమో కానీ పబ్లిక్ ప్రాపర్టీలు కాదు’ అని అన్నారు. <<19407702>>నయనతారపై MP వ్యాఖ్యలు<<>>, విజయ్-త్రిష వ్యవహారంపై ఆమె ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
News March 17, 2026
ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లను వాడుకోవాలని కేంద్రం సూచన

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. LPGకి బదులు వీలున్నవాళ్లు ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లను వాడుకోవాలని తెలిపింది. ఇలా ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లను వాడమని సూచించడం ఇదే తొలిసారి. అలాగే PNGకి మారే అవకాశాన్నీ పరిశీలించాలని కోరింది. ఇలా వీలైన చోట గ్యాస్‌ను పొదుపు చేయడం కోసం ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలంది. ఎట్టిపరిస్థితుల్లో పానిక్ బుకింగ్ చేయొద్దని కోరింది.
News March 17, 2026
‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్‌పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.


