News September 3, 2025

ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్!

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించాలని కంపెనీ యాజమాన్యాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కంపెనీలన్నీ ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు. దీనిపై సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో త్వరలో సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఈ పథకానికి సహకారం అందించడం తమ అదృష్టమని మంత్రులతో అన్నారు.

Similar News

News September 4, 2025

ఆ కోర్సుల్లో దృష్టి లోపం గల దివ్యాంగులకు అనుమతి: విద్యాశాఖ

image

AP: మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు MPC, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ GO జారీ చేసింది. సైన్స్ కోర్సుల్లో తమకు అవకాశం కల్పించాలన్న దివ్యాంగుల విజ్ఞప్తికి స్పందించిన లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరవ్వడం కష్టమని అధికారులు తెలపగా, బదులుగా లఘురూప ప్రశ్నలతో ఎసెస్‌మెంట్ చేయాలని మంత్రి సూచించారు.

News September 4, 2025

నల్ల కళ్లజోడుతో మంత్రి పార్థసారథి.. ఎందుకంటే?

image

AP: క్యాబినెట్ భేటీలో, ఆ తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సమయంలో మంత్రి పార్థసారథి నల్ల కళ్లజోడుతో కన్పించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలువురు ఆరా తీశారు. కాగా ఇటీవల మంత్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కళ్లకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అందుకే కళ్లజోడు పెట్టుకొని కనిపించారని వెల్లడించారు.

News September 4, 2025

కలుషిత నీటితోనే తురకపాలెంలో మరణాలు: అంబటి

image

AP: కలుషిత నీటిని ఉపయోగించడమే తురకపాలెంలో <<17599008>>మరణాలకు<<>> కారణమని తమ పరిశీలనలో తేలిందని YCP నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ నీటిని వాడటంతో అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారని ఆరోపించారు. గుంటూరు తురకపాలెంలో పర్యటించిన నేతలు మరణాలకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు.