News July 11, 2024
సెన్సార్ పూర్తి చేసుకున్న భారతీయుడు-2

కమల్ హాసన్ ‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం రన్ టైమ్ 180.04 నిమిషాలు ఉండనుంది. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రేపు విడుదల కానున్న ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కించగా లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Similar News
News January 4, 2026
ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.
News January 4, 2026
రేపు బీఆర్ఎస్ PPT

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో నిర్వహించిన చర్చకు కౌంటర్‌గా బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట PPT ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా రాష్ట్ర ఏర్పాటు సమయంలో నీటి కేటాయింపుల్లో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి అన్యాయం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.
News January 3, 2026
వెనిజులాపై అమెరికా ఎందుకు దాడి చేసింది?

వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని <<18751661>>అదుపులోకి<<>> తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై దాడికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మదురో పాలనతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి భారీగా USకు వలసలు పెరిగాయి. అదే విధంగా వెనిజులా చమురు నిల్వలపై అమెరికా ఆసక్తి చూపిస్తోంది. దీంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా అంశం కూడా ట్రంప్ కఠిన చర్యలకు దారి తీశాయని విశ్లేషకుల అభిప్రాయం.


