News September 13, 2024
‘దేవర’లో 4 సీన్లపై సెన్సార్ అభ్యంతరాలు?

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి U/A సర్టిఫికెట్ లభించినట్లు ‘బాలీవుడ్ హంగామా’ పేర్కొంది. 4 సీన్లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని తెలిపింది. ఓ పాత్ర తన భార్యను, మరో పాత్ర తన తల్లిని తన్నిన సీన్లను మూవీ టీం మార్చింది. ఇక కత్తిపై శరీరం వేలాడుతున్న ఓ సీన్ తొలగించారు. ఎన్టీఆర్ సొరచేపపై ప్రయాణించిన సన్నివేశంలో అది CGI షార్క్ అన్న టిక్కర్ వేయాలని బోర్డు సూచించింది.
Similar News
News October 23, 2025
NOV 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు: పవన్

AP: పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘నవంబర్ 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలి. పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలి. పాలనా సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. పల్లె పండుగ 2.0తో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక ఇవ్వాలి’ అని ఆదేశించారు.
News October 23, 2025
సముద్ర మట్టం పెరిగితే 282 గ్రామాలు ముంపు

AP: దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటివల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టమూ ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్నకాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపుబారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10L మందిని తరలించాల్సి రావచ్చంటున్నారు. ఇప్పటికే 32% తీరప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన GOVT దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది.
News October 23, 2025
చిన్నారులకు నాన్వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.