News November 21, 2024

కులగణన సర్వే 78% పూర్తి

image

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే 78% పూర్తయింది. ములుగు జిల్లాలో సర్వే 100% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జనగాం జిల్లాలో 99.9%, నల్గొండలో 97.7% పూర్తయినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News

News November 21, 2024

నమ్మండి.. ఈ పెయింటింగ్ రూ.వెయ్యి కోట్లు

image

న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్‌లో ఓ పెయింటింగ్ రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ కళాకారుడు రెనే మాగ్రిట్టే వేసిన పెయింటింగ్‌కు 121 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,021కోట్లు) పలికింది. ఇది వరల్డ్ రికార్డు. కాగా ‘ది ఎంపైర్ ఆఫ్ లైట్’ అనే పేరుతో ప్రదర్శనకు వచ్చిన ఈ పెయింటింగ్‌‌ను రాత్రి, పగలు ఒకేసారి కనిపించేలా గీశారు. గతంలోనూ రెనే వేసిన ఓ పెయింటింగ్‌ 79మిలియన్ డాలర్లు పలకడం గమనార్హం.

News November 21, 2024

రీరిలీజ్‌లపై మహేశ్‌బాబు అభిప్రాయం ఇదే!

image

‘దేవకీ నందన వాసుదేవ’ రిలీజ్ నేపథ్యంలో మహేశ్‌బాబుతో హీరో గల్లా అశోక్ కలిసి ట్విటర్‌లో #AskSSMBandAG నిర్వహించారు. ఇందులో రీరిలీజ్‌లపై మహేశ్ అభిప్రాయం ఏంటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి సూపర్ స్టార్ స్పందిస్తూ.. ‘పోకిరితో స్టార్ట్ చేసి మొన్న మురారి వరకు రీరిలీజ్‌లు చూసినప్పుడల్లా అభిమానులు చేసిన సందడి నా పాత రోజులను గుర్తుచేశాయి. నా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్’ అని చెప్పారు.

News November 21, 2024

కెప్టెన్సీపై బుమ్రా కీలక వ్యాఖ్యలు

image

BGT తొలి టెస్టుకు టీమ్ ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నట్లు జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘రోహిత్, కోహ్లీ కెప్టెన్సీ స్టైల్స్ వేర్వేరుగా ఉంటాయి. నేనూ నా సొంత శైలిలో బాధ్యతలు నిర్వర్తిస్తా. టీమ్ కాంబినేషన్‌ను ఇప్పటికే ఫైనల్ చేశాం. రేపు మ్యాచుకు ముందు ప్రకటిస్తాం’ అని తెలిపారు. అన్నీ అనుకూలిస్తే ఈ సిరీస్‌లో షమీ కూడా ఆడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.