News December 2, 2024

విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేసిన కేంద్రం

image

ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ONGC వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుంటాయి.

Similar News

News March 26, 2026

సుప్రీంలీడర్‌గా ఉండమని ఇరాన్ కోరింది: ట్రంప్

image

ట్రంప్ వంటి వ్యక్తులతో అసలు చర్చలే చేయమని <<19472137>>ఇరాన్<<>> అంటున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలీడర్‌గా బాధ్యతలు తీసుకోమని ఇరాన్ తనను అనధికారికంగా కోరిందని.. కానీ తనకు అవసరం లేదని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వీలైనంత త్వరగా డీల్ చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.

News March 26, 2026

CSK బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు.. ఓపెనర్స్ ఎవరంటే?

image

ఈ ఏడాది IPLలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్లు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. సంజూ శాంసన్‌, తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని కెప్టెన్స్ డే ఈవెంట్‌లో తెలిపారు. ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే ఓపెనర్‌గా దిగడం లేదని చెప్పారు. దీంతో అతను మూడో స్థానంలో, బ్రెవిస్ ఫోర్త్ ప్లేస్‌లో ఆడే అవకాశం ఉంది. కాగా గత సీజన్ ఆరంభంలో చెన్నై ఓపెనింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

News March 26, 2026

చరణ్‌‌కు సర్జరీ.. వైద్యుడికి చిరు థాంక్స్

image

‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో రామ్ చరణ్ కంటిరెప్ప పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సకాలంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు నైపుణ్యంతో చేసిన సర్జరీ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ నైపుణ్యం దానిని తొలగించింది. మీకు కృతజ్ఞులం’ అని చిరు ట్వీట్ చేశారు.