News October 30, 2024

మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి

image

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000 కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే చెప్పింది. ఇది అడ్వాన్స్ మాత్రమేనని, మిగిలింది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. కాగా ఈ FYలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల అప్పు చేసింది.

Similar News

News November 19, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరిగి తీరుతుంది: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. ‘అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదో లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలి. పాక్‌లో పర్యటించడానికి భారత్‌కు ఏంటీ సమస్య? ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం. ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News November 19, 2024

తెలుగు రాష్ట్రాల్లో నేటి కార్యక్రమాలు

image

☛ వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన, ప్రజాపాలన విజయోత్సవ సభ
☛ ఖమ్మంలో బీసీ డెడికేషన్ కమిషన్ పర్యటన
☛ లగచర్ల కేసు.. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
☛ ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం (1.సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు, 2.ఎక్సైజ్, 3.విదేశీ మద్యం వాణిజ్యం, 4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు)
☛ నేడు పోలీసుల కస్టడీకి బోరుగడ్డ అనిల్

News November 19, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

*అల్యూమినియం బకెట్ మాత్రమే వాడండి. ఇనుప బకెట్ షాకిచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బకెట్ అయితే కరిగిపోయే ఛాన్స్ ఉంది.
*స్విచ్ ఆఫ్ చేసి హీటర్ బకెట్‌లో నుంచి తీసిన తర్వాతే నీళ్లు వేడి అయ్యాయో లేదో చూడాలి. లేదంటే షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది.
*పిల్లలు తిరిగే దగ్గర వాటర్ హీటర్ వాడకండి.
*హీటింగ్ కాయిల్ (రాడ్) నీటిలో మునిగేలా ఉంచండి.
*ISI మార్క్, షాక్ ప్రూఫ్ హీటర్లనే కొనుగోలు చేయండి.