News September 30, 2024

కేంద్రం బెంగాల్‌ను పట్టించుకోవడం లేదు: సీఎం మమత

image

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు కేంద్రం నుంచి ఎటువంటి చేయూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తర బెంగాల్ అల్లకల్లోలంగా ఉంది. పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేంద్రం మాకు ఏమాత్రం సాయం చేయడం లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్ గుర్తొస్తుంది’ అని మండిపడ్డారు.

Similar News

News September 30, 2024

బుమ్రా IPL వేలంలోకి వస్తే?: హర్భజన్

image

టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా IPL వేలంలోకి వస్తే టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలుస్తారని మాజీ క్రికెటర్ హర్భజన్ అన్నారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? అని తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ముంబై జట్టులో ఉన్న బుమ్రాకు రూ.12కోట్లు వస్తున్నాయి. వచ్చే సీజన్‌కు ఆయన ముంబైతోనే ఉంటారా? ఉంటే వచ్చే ప్రైస్ ఎంత? లేదా ఆక్షన్‌లోకి వస్తారా? అనేది రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక తెలుస్తుంది.

News September 30, 2024

రూ.7,200 కోట్లివ్వండి.. కేంద్రానికి రాష్ట్రం లేఖ

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నవంబర్ నుంచి పనులు ప్రారంభించి ఒకే సీజన్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ నిధులు విడుదల చేస్తే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.

News September 30, 2024

వారం, 10 రోజుల్లో గ్రూప్-1 మెయిన్ హాల్ టికెట్లు

image

TG: గ్రూప్-1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు వారం, 10 రోజుల్లో విడుదల కానున్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగనుండగా, తొలి రోజు తీసుకెళ్లిన హాల్ టికెట్‌నే అన్ని పరీక్షలకు తీసుకెళ్లాలని TGPSC తెలిపింది. రోజుకో కొత్త హాల్ టికెట్‌తో వెళ్తే ఇన్విజిలేటర్లు పరీక్షకు అనుమతించరని పేర్కొంది. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్ టికెట్లను భద్రపరచుకోవాలని సూచించింది.