News November 29, 2024
బీమారంగంలో 100% FDIకి కేంద్రం సై!
భారత బీమా కంపెనీల్లో FDI పరిమితిని 74 నుంచి 100 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు బీమా వ్యాపారాలను నిర్వహించేందుకు కంపెనీలకు అనుమతించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఇక అన్ని కంపెనీలూ లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సేవల్ని అందించేందుకు వీలవుతుంది. ఇక ఫారిన్ రీఇన్సూరర్స్ సొంత నిధుల అవసరాన్ని రూ.5000 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది.
Similar News
News November 29, 2024
సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన
AP: మాజీ సీఎం, YSRCP అధినేత YS జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ప్రతి రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సమీక్షిస్తారు.
News November 29, 2024
PM విశ్వకర్మ పథకంపై తమిళనాడులో వివాదం
కుల ఆధారిత అసమానతలను పెంపొందించే అవకాశం ఉన్నందున ‘PM విశ్వకర్మ’ పథకాన్ని తిరస్కరిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 రకాల చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించే ఈ పథకానికి వారసత్వంగా వృత్తిని స్వీకరించిన వారే అర్హులనడం వివాదమైంది. ఇతర వర్గాలను ఎంపిక చేయకపోవడం వివక్ష చూపడమే అని పేర్కొంది. అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ తామే కొత్త పథకాన్ని తెస్తామని తెలిపింది.
News November 29, 2024
ఇదెక్కడి మాస్ రా మావా..!
మనకు నచ్చని పని చేసేందుకు వెనకాడుతున్నట్లే.. కప్పలు కూడా మగవాటితో సంభోగం ఇష్టం లేకుంటే అవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కప్పలు మగవాటి దృష్టిని మళ్లించేందుకు చనిపోయినట్లు నటిస్తాయని కెమెరాలో రికార్డయింది. కలయిక ఇష్టం లేని సమయంలో దాన్నుంచి తప్పించుకోవడానికి కప్పలు వంటివి ఇలా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవర్తించడాన్ని గుర్తించారు. తెలివిగా కదలకుండా, కళ్లు మూసుకొని, నిర్జీవ స్థితిలో ఉంటున్నాయి.