News December 6, 2024
ఉద్యోగ ఖాళీలపై సమాధానం దాటవేసిన కేంద్రం

మంత్రిత్వ శాఖల్లో, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కేంద్రం దాటవేసింది. ఖాళీలపై MP దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించగా ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని కేంద్రం చెప్పుకొచ్చింది. ఖాళీల వివరాలు ఆయా శాఖల వద్దే ఉంటాయని, వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశిస్తుంటామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బదులిచ్చారు. అయితే ఖాళీలపై స్పష్టత ఇవ్వలేదు.
Similar News
News March 1, 2026
ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: పుతిన్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. ఈ హత్య కిరాతకమైన చర్య అని పేర్కొన్నారు. నైతికత, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఖమేనీని చంపారని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ఇరాన్ సన్నిహితుడు మసూద్ పెజెష్కియాన్(ప్రెసిడెంట్)కు రాసిన లేఖలో పేర్కొనట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ హతమైన విషయం తెలిసిందే.
News March 1, 2026
వేసవి ఆరంభంలోనే పీక్ స్టేజ్‌కి విద్యుత్ డిమాండ్

TG: వేసవి ఆరంభంలోనే ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే రాష్ట్రంలో విద్యుత్ డిమాండూ పెరిగిపోతోంది. శనివారం 6057 MW గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా నేడు దాన్ని దాటి 6267 MWకు చేరుకుంది. రానున్న కాలంలో ఎండలు మరింత పెరిగి డిమాండూ అధికమయ్యే పరిస్థితి ఉందని NPDCL CMD వరుణ్ రెడ్డి తెలిపారు. అయితే ఇబ్బందులు తలెత్తకుండా డిమాండ్‌కు తగ్గ విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
News March 1, 2026
భారత్ ఘోర ఓటమి.. సిరీస్ వైట్ వాష్

హోబర్ట్ వేదికగా ఇండియా ఉమెన్స్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ 185 రన్స్ తేడాతో గెలిచింది. 410 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన IND 224 పరుగులకు ఆలౌటైంది. స్నేహ్ రాణా(44) టాప్ స్కోరర్. AUS బౌలర్లలో అలానా కింగ్ 4 వికెట్లతో సత్తా చాటారు. అంతకుముందు అలీసా హీలీ(158), బెత్ మూనీ(106) సెంచరీలు చేయడంతో ఆసీస్ 409-7 స్కోర్ చేసింది. ఈ విజయంతో 3 మ్యాచుల ODI సిరీస్‌ను AUS వైట్ వాష్ చేసింది.


