News July 23, 2024
కేంద్రం గుడ్‌న్యూస్.. పిల్లలకు పెన్షన్ స్కీమ్

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)లో కేంద్రం మార్పులు చేసింది. పెన్షన్ పథకంలో మైనర్లను చేరుస్తూ ‘NPS-వాత్సల్య’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పేరెంట్స్, సంరక్షకులు పిల్లల పేరిట డబ్బులు జమ చేయొచ్చు. వారు మేజర్ అయ్యాక అది అటోమేటిక్‌గా రెగ్యులర్ NPS అకౌంట్‌గా మారుతుంది. పిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు.
Similar News
News April 2, 2026
పోలవరంలో కీలక ఘట్టం పూర్తి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.వెయ్యి కోట్లు వెచ్చించి నిర్మించామన్నారు. దీంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
News April 2, 2026
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

ఇరాన్ యుద్ధాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పొరుగు దేశం(పాకిస్థాన్) కవ్విస్తే అంతకు రెట్టింపు సమాధానం చెబుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కేరళలో సైనిక్ సమ్మేళన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. Op సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.
News April 2, 2026
హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.


